BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 12 October 2026, 07:46 am
Posted by : NTODAY NEWS

ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
12 Oct, 2026 - 07:46 AM
21 వీక్షణలు

50 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.. అధ్యక్షుడిగా ఎం. ధర్మ నాయక్‌, ప్రధాన కార్యదర్శిగా ఆర్‌. శ్రీరాం నాయక్‌

హైదరాబాద్‌ (ఎన్‌ టుడే న్యూస్‌): తెలంగాణ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా, రవీందర్‌ నాయక్‌ నగర్‌లో అక్టోబర్‌ 10, 11 తేదీల్లో విజయవంతంగా ముగిశాయి. ఈ మహాసభల్లో గిరిజనుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు సంబంధించి పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. 50 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.

ఎం. ధర్మ నాయక్‌, భూక్యా వీరభద్రం, ఎం. బాలు నాయక్‌, గుగులోత్‌ భీమా సాహెబ్‌, ఎర్ర నాయక్‌, అచ్చాలి బాయి అధ్యక్షతన మహాసభలు జరిగాయి. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. శ్రీరాం నాయక్‌ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. వాంకుడోత్‌ వీరన్న, అశోక్‌ తదితరులు వేదికపై ఉన్నారు.

గిరిజన సమస్యలపై పలు తీర్మానాలు

కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని మహాసభ తీర్మానించింది. కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, మైదాన ప్రాంత గిరిజనుల కోసం ఐదు ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని, మూడు గిరిజన కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రూ.1,500 కోట్లు కేటాయించాలని మహాసభ డిమాండ్‌ చేసింది. ఠానూ నాయక్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, గిరిజన బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలని, లంబాడీ భాషను గుర్తించి ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని కోరింది. వీటితోపాటు మరో ఆరు గిరిజన సమస్యలపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక

మహాసభల్లో 50 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం. ధర్మ నాయక్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆర్‌. శ్రీరాం నాయక్‌ ఎన్నికయ్యారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు:

- గుగులోత్‌ భీమా సాహెబ్‌ – కరీంనగర్‌

- అశోక్‌ – నాగర్‌కర్నూల్‌

- మూడ్‌ రవి నాయక్‌ – నల్గొండ

- మాలోత్‌ కిషన్‌ – మహబూబాబాద్‌

- బాల్య నాయక్‌ – వనపర్తి

రాష్ట్ర సహాయ కార్యదర్శులు:

- భూక్యా వీరభద్రం – ఖమ్మం జిల్లా

- మూడ్‌ బాలు నాయక్‌ – హైదరాబాద్‌ దక్షిణం

- వాంకుడోత్‌ వీరన్న – హనుమకొండ

- ఎర్ర నాయక్‌ – నల్గొండ

- అరుణ్‌ నాయక్‌ – రాష్ట్ర కేంద్రం

- మహిళా ప్రతినిధికి కోఆప్షన్‌ ద్వారా అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మొత్తం 15 మంది కార్యదర్శివర్గ సభ్యులు, 35 మంది రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిపి 50 మందితో నూతన కమిటీ ఏర్పాటైంది.

సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాల నాయకులు

మహాసభలకు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్‌ రాములు, ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి. అబ్బాస్‌, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్‌ సంఘీభావం తెలిపారు. వీ రామ్‌కుమార్‌ నాయక్‌ స్వభారత సందేశాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌. కిషన్‌ నాయక్‌, ఏ. కృష్ణ నాయక్‌, శశికళ, మీనా, నాగేశ్వర్‌, కోటయ్య, శ్రావణ్‌, లక్ష్మమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.