BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 06:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వేగివాడలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని నిలదీసిన గ్రామస్తులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 06:40 PM
32 వీక్షణలు

వేగివాడలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని నిలదీసిన గ్రామస్తులు

ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో సోమవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొల్లేరు లంక గ్రామాలకు సంబంధించిన చేపల చెరువుల లీజు బకాయిల అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని గ్రామస్తులు నిలదీయడంతో కొద్దిసేపు గందరగోళం చోటుచేసుకుంది.

జంగారెడ్డిగూడెంలో కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న అబ్బయ్య చౌదరి వాహనాన్ని వేగివాడ వద్ద కొందరు గ్రామ పెద్దలు అడ్డుకుని లీజు బకాయిల విషయంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

ఈ క్రమంలో అబ్బయ్య చౌదరి వాహనం ముందుకు కదిలే సమయంలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది.

తమపై దాడి జరిగిందని కొల్లేరు గ్రామాల ప్రతినిధులు, కూటమి నేతలు ఆరోపిస్తుండగా, మరోవైపు తమ వాహనంపై దాడికి ప్రయత్నించారని అబ్బయ్య చౌదరి వర్గీయులు చెబుతున్నారు. దీంతో వేగివాడలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కొల్లేరు లంక గ్రామాలకు సంబంధించిన చేపల చెరువుల లీజు బకాయిలను వెంటనే చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఫిర్యాదులు అందిన తర్వాత పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.