TG: RTC గుర్తింపు సంఘం ఎన్నికల్లో EU కూటమి సత్తా చాటింది.
ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి హవా
దాదాపు 4,500 ఓట్ల మెజారిటీతో విజయం.. ఈ నెల 17న తుది ఫలితాలు
హైదరాబాద్, అక్టోబర్ 10 (ఎన్ టుడే న్యూస్):
తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) కూటమి సత్తా చాటినట్లు సమాచారం. ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ కలిసి ఏర్పాటు చేసిన కూటమి దాదాపు 4,500 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద గుర్తింపు సంఘంగా ఈయూ కూటమి నిలవనుంది.
మరోవైపు కాంగ్రెస్ మద్దతు తెలిపినట్లు ప్రచారంలో ఉన్న టీడబ్ల్యూయూ కూటమికి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.
బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఈ నెల 17న తుది ఫలితాలు వెలువడనున్నాయి. తుది ఫలితాల ప్రకటనతో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలపై పూర్తి స్పష్టత రానుంది.