BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 March 2026, 07:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తృటిలో తప్పిన ప్రమాదం ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 07:04 PM
187 వీక్షణలు

తృటిలో తప్పిన ప్రమాదం  ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా

చిలకలూరిపేట, సోమవారం:

మండల పరిధిలోని పసుమర్తి సమీపంలో నూతన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సును ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది.

సమాచారం మేరకు, కళాశాల బస్సు ఇంకొల్లు నుంచి నరసరావుపేట వైపు విద్యార్థులతో వెళ్తుండగా, పసుమర్తి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం అదుపు కోల్పోయి బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో బస్సు స్వల్పంగా దెబ్బతినగా, విద్యార్థులందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో ఉపశమనం కలిగింది.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే కళాశాల యాజమాన్యం స్పందించి, మరో బస్సును ఘటనా స్థలానికి పంపించి విద్యార్థులను కళాశాలకు తరలించింది.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.