BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 01 June 2026, 08:36 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 08:36 AM
199 వీక్షణలు

అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. సొంత నగదు రూ.20 వేల సాయం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సోమవారం గ్రామానికి చెందిన చెన్ను నాగభూషణం అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించిన మంత్రి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని తన సొంత నగదు నుంచి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

వ్యవసాయ కూలీగా కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూనే తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాగభూషణం పరిస్థితిని తెలుసుకున్న మంత్రి, కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స భారంగా మారిన సమయంలో మంత్రి స్వయంగా ఇంటికి వచ్చి సాయం చేయడంతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా నాగభూషణం కుమారుడి విద్యార్హతల గురించి తెలుసుకున్న మంత్రి, హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన తర్వాత తనను కలవాలని సూచిస్తూ మంచి ఉద్యోగం కల్పించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో మెరుగైన వైద్యం అవసరమైనా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.

మంత్రి పార్థసారథి చూపిన ఆప్యాయత, ఆర్థిక సాయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆయన అందించిన చేయూత ఆదర్శనీయమని అభినందించారు.