BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 01 June 2026, 11:01 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 11:01 AM
292 వీక్షణలు

చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు నెల్లూరి సతీష్–శిరీష దంపతుల కుమారులు ఫణి సందీప్, మనోసాహిత్‌ల పంచెలు వేడుక, అలాగే రాజేష్–వనజ దంపతుల కుమార్తెలు మహాలక్ష్మి, హిమజల ఓణీల వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నూజివీడు మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.

ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ మాజీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, పోతనపల్లి మాజీ సర్పంచ్, వైసీపీ సీనియర్ నేత కారంగుల శ్రీనివాసరావు, చాట్రాయి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ మండల పార్టీ అధ్యక్షుడు పుచ్చకాయల సుబ్బారెడ్డి, పర్వతాపురం మాజీ సర్పంచ్ మిద్దె శివాజి, సోమవరం గ్రామ వైసీపీ నేత ఉప్పాల సోమేశ్వరరావు, ఆరుగొలనుపేట మాజీ సర్పంచ్ పుచ్చకాయల అప్పిరెడ్డి,చాట్రాయి వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస రెడ్డి బూరుగుగూడెం వైసిపి గ్రామ పార్టీ అధ్యక్షులు గడ్డం లోకేశశ్వ‌‌‌ర రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, రాఘవరెడ్డి లు మాట్లాడుతూ, పంచెలు మరియు ఓణీల వేడుకలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే ఇలాంటి శుభకార్యాలు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. చిన్నారులు విద్య, క్రమశిక్షణ, సంస్కారాలతో ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను నేర్పించాలని సూచించారు. నేటి చిన్నారులే రేపటి సమాజ నిర్మాతలని, వారు అన్ని రంగాల్లో రాణించి కుటుంబాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం చిన్నారులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.