BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 01 June 2026, 09:14 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 09:14 AM
233 వీక్షణలు

ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు

పెన్షన్ల లబ్ధిదారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. జూన్ నెల నుంచి కొత్తగా 5,606 మందికి స్పౌజ్ కేటగిరీ కింద వితంతు పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

జూన్ 1న రాష్ట్రవ్యాప్తంగా 62.34 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కోసం రూ.2,728 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్తగా అర్హత సాధించిన వితంతువులకు ఈ నెల నుంచే పెన్షన్ అందనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జూన్ 12న మరిన్ని లక్షల మంది అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశమున్నట్లు సమాచారం. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా పలు వర్గాల ప్రజలకు మరింత ఆర్థిక భరోసా లభించనుంది.

"అర్హులందరికీ సంక్షేమ ఫలాలు" లక్ష్యంగా ప్రభుత్వం పెన్షన్ పంపిణీని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.