BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 16 July 2026, 05:53 pm
Posted by : V శ్రీనివాస్

​విద్యార్థులకు తెలుగు భాషను సంస్కృతిగా బోధించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jul, 2026 - 05:53 PM
131 వీక్షణలు

​విద్యార్థులకు తెలుగు భాషను సంస్కృతిగా బోధించాలి: జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

​జిల్లా కేంద్రంలో ఘనంగా తెలుగు భాషా శిక్షణ కార్యక్రమం

​సృజనాత్మక పద్ధతులతో విద్యార్థుల్లో భాషాభిరుచిని పెంపొందించాలి

​మంచిర్యాల, జూలై 16 :తెలుగు భాషను కేవలం ఒక పాఠ్యాంశంగా మాత్రమే చూడకుండా, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావించి విద్యార్థులకు బోధించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'తెలుగు భాషా శిక్షణ కార్యక్రమానికి' ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర భాషల ప్రభావం కారణంగా విద్యార్థులకు తెలుగు భాషను సమర్థవంతంగా బోధించడం కొంత సవాలుగా మారిందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు తెలుగు ఉపాధ్యాయులు సృజనాత్మక బోధనా విధానాలను అవలంబించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న వినూత్న బోధనా పద్ధతులను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థులలో తెలుగు భాషపై ఆసక్తి, అభిరుచిని పెంపొందించాలన్నారు. ముఖ్యంగా కథలు, కవితలు, పద్యాలు, నాటికలు వంటి సాహిత్య ప్రక్రియలను ఉపయోగించి విద్యార్థులలో భాషా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా వినియోగించాలని ఉపాధ్యాయులను కోరారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా కోర్సు కో-ఆర్డినేటర్ జంబోజు సత్తయ్య, శిక్షణ కేంద్ర ఇన్‌చార్జి బోనగిరి శ్రీనివాస్, జిల్లా స్థాయి డి.ఆర్.పి.లు మరియు తెలుగు భాష ఉపాధ్యాయులు పాల్గొన్నారు