BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 16 July 2026, 05:52 pm
Posted by : V శ్రీనివాస్

​బీసీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jul, 2026 - 05:52 PM
285 వీక్షణలు

​బీసీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలి: జాతీయ బీసీ హక్కుల సాధన సమితి డిమాండ్

​మంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని జాతీయ బీసీ హక్కుల సాధన సమితి ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేటికీ ఏ ఒక్క అంశాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వారు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% కి పెంచి A, B, C, D గ్రూపులుగా వర్గీకరించడం, ఐదేళ్లలో బీసీ సంక్షేమానికి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం, చట్టబద్ధతతో కూడిన 'మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్' ఏర్పాటు, ఎంబీసీ (MBC) ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు మరియు అన్ని జిల్లా కేంద్రాలలో రూ. 50 కోట్ల వ్యయంతో బీసీ భవనాల నిర్మాణం వంటి ప్రధాన వాగ్దానాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

​అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మూడేళ్లు ముగుస్తున్నా కనీస చొరవ చూపకపోవడం అత్యంత ఖేదకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీసీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉధృత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు శాఖపూరి భీమ్సేన్, చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు