BREAKING
thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● శ్రీ శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ కమిటీలు ఏర్పాటు చేయాలి thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● శ్రీ శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ కమిటీలు ఏర్పాటు చేయాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 07:53 pm
Posted by : KOLA MAHESH

సాగునీరు, తాగునీరు అందేవరకు పోరాటం ఆగదు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 07:53 PM
3 వీక్షణలు

జీవో నంబర్ 98 రద్దు చేయాలి.. గార్ల మండల జలసాధన కమిటీ డిమాండ్

గార్ల, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

గార్ల మండలంలోని రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని గార్ల మండల జలసాధన కమిటీ స్పష్టం చేసింది. మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్టుకు సంబంధించిన జీవో నంబర్ 98ను రద్దు చేయాలని, గార్ల మండల ప్రజల నీటి హక్కులను కాపాడాలని కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.

ఏడాదిగా వివిధ రూపాల్లో ఉద్యమాలు

మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్టు వల్ల గార్ల మండల రైతులు, ప్రజలకు కలిగే నష్టాలను వివరిస్తూ దాదాపు ఏడాది కాలంగా జలసాధన కమిటీ ఆధ్వర్యంలో పలు ఉద్యమాలు, సమావేశాలు నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. అఖిలపక్ష, మిత్రపక్షాల ఆధ్వర్యంలో రైతులతో సమావేశాలు నిర్వహించి కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

గార్ల, చిన్న కిష్టాపురం, అంజనాపురం, చంద్రగిరి, ముల్కనూరు, మర్రిగూడెం, పూసల తండా, మూడు తండా తదితర గ్రామాల్లో పర్యటించి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతులు, ప్రజల్లో నీటి హక్కులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు

ప్రాజెక్టు వల్ల కలిగే నష్టాలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో వివిధ పార్టీల నాయకులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేసినట్లు కమిటీ నాయకులు తెలిపారు.

సీపీఐ శాసనసభాపక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీ, గోపగాని శంకర్రావు, కేటీఆర్, వద్దిరాజు రవిచంద్ర, హరీశ్ రావు, సత్యవతి తదితరులను కలిసి సమస్యలను వివరించినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరెం కనకయ్య చొరవతో ఇరిగేషన్ అధికారులను కలిసి సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.

పరిహారం పెంపులో ఉద్యమాల పాత్ర ఉందని కమిటీ వెల్లడి

సైకిల్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, గ్రామసభలు, అధికారులకు వినతిపత్రాల సమర్పణ వంటి కార్యక్రమాలను ఏడాది కాలంగా నిర్వహించినట్లు నాయకులు వివరించారు. ముల్కనూరు, చంద్రగిరి రెవెన్యూ గ్రామాల్లో భూనిర్వాసిత రైతులకు గతంలో ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉన్న పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించడంలో తమ ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయని కమిటీ నాయకులు పేర్కొన్నారు.

అరెస్టులు, నిర్బంధాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు

పోరాట సమయంలో కమిటీ నాయకులు పలుమార్లు అరెస్టులు, పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొన్నప్పటికీ ఉద్యమాన్ని కొనసాగించినట్లు తెలిపారు. బుద్ధారం పంచాయతీ పరిధిలోని కౌన్సిల్ తండా వద్ద సర్వేలను అడ్డుకుంటూ 24 గంటల పాటు నిరసన చేపట్టినట్లు వివరించారు. అధికారులతో వాగ్వాదాలు, పోలీసుల ఒత్తిళ్లు ఎదురైనా రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగించామని పేర్కొన్నారు.

ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని తీర్మానం

జలసాధన కమిటీ కన్వీనర్ గంగావతి లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రైతులు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని తీర్మానించినట్లు నాయకులు తెలిపారు. ప్రాజెక్టు పనులు, సర్వేలు కొనసాగుతున్న నేపథ్యంలో జీవో నంబర్ 98ను రద్దు చేయడంతో పాటు గార్ల మండల రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్

“మా నీరు.. మా హక్కులు” అనే నినాదంతో గార్ల మండలానికి అన్యాయం జరిగితే సహించేది లేదని కమిటీ నాయకులు హెచ్చరించారు. అఖిలపక్ష, మిత్రపక్షాల సహకారంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

అదేవిధంగా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని గార్ల, బయ్యారం మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించేలా స్థానిక ఎమ్మెల్యే కోరెం కనకయ్య, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ చొరవ తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో జలసాధన కమిటీ నాయకులు కట్టేబోయిన శ్రీనివాస్, కందునూరి శ్రీనివాస్, కత్తి సత్యం, గుగులోతు శక్రు, జడ సత్యనారాయణ, వెంకన్న, ఈశ్వర్, లింగం, రవి, మాజీ సర్పంచ్ శక్రు, పలువురు రైతులు పాల్గొన్నారు.