BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 09 October 2026, 11:05 pm
Posted by : NTODAY NEWS

గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
09 Oct, 2026 - 11:05 PM
12 వీక్షణలు

సింగరేణి కాలనీలో తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కార్యక్రమం

నాటికలు, పాటలతో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన

సైదాబాద్‌, అక్టోబర్‌ 9 (ఎన్‌ టుడే న్యూస్‌):

గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసై యువత తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని కళాకారులు పిలుపునిచ్చారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లి నరసింహ నేతృత్వంలో సింగరేణి కాలనీలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గంజాయి వినియోగం వల్ల యువత ఎదుర్కొనే సమస్యలు, వారి జీవితాలపై పడే ప్రతికూల ప్రభావాలను కళ్లకు కట్టినట్లు వివరించే నాటికను ప్రదర్శించారు. అలాగే ‘గంజాయి మత్తులో’ అనే పాట ద్వారా మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. నాటికలు, పాటల రూపంలో సాగిన ఈ కార్యక్రమం కాలనీవాసులను ఆలోచింపజేసింది.

యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే విద్య, ఉపాధి, కుటుంబ జీవితం దెబ్బతినడంతో పాటు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా సందేశమిచ్చారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్‌ నాయకుడు ఆర్‌. శంకర్‌ నాయక్‌, డివిజన్‌ కార్యదర్శి షేక్‌ మహబూబ్‌, మహిళా నాయకురాలు చక్రి భాయ్‌, డివిజన్‌ నాయకులు వర్త్య దసరత్‌ నాయక్‌, నర్సింగ్‌రావు, శ్యామ్‌, వెంకటేష్‌, దశరథ్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజానాట్యమండలి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల కార్యదర్శులతో పాటు కళాకారులు జోసఫ్‌, భాను, అరుణ్‌ పాల్గొన్నారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు.