BREAKING
thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం
Date of Publish : 02 October 2026, 10:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Oct, 2026 - 10:24 PM
9 వీక్షణలు

ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా తిరువూరు పోలీసుల అవగాహన కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు ఆపరేషన్ త్రిశూల్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ ఐపీఎస్ దిశానిర్దేశంలో, మైలవరం ఏసీపీ రామచంద్రరావు నేతృత్వంలో, తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గురు ప్రకాష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం లక్ష్మీపురం సర్కిల్ వద్ద వాహనదారులకు రహదారి భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు ఎస్‌ఐ వై.వి. శాతకర్ణి రహదారి భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించగా, మహిళా ఎస్‌ఐ గౌరీశ్వరి మహిళల భద్రత, మహిళలపై జరిగే అఘాయిత్యాల నివారణపై వివరించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు శాఖ పనిచేస్తుందని అవగాహన కల్పించారు.

ప్రజల భద్రతే లక్ష్యంగా, ప్రతి ప్రాణాన్ని రక్షించడమే ధ్యేయంగా ఆపరేషన్ త్రిశూల్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం, మహిళలకు సురక్షిత వాతావరణం, ప్రమాదాలు లేని రహదారుల సాధనకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.