BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 07:00 pm
Posted by : K MAHESH

కులమతాలకు అతీతంగా సమానత్వాన్ని చాటిన భారత రాజ్యాంగం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 07:00 PM
13 వీక్షణలు

రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ బాదావత్ లక్ష్మీ రాజు నాయక్, ఉపసర్పంచ్ ఎర్ర నాగేశ్వరరావు

నవంబర్ 26:

కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమన్యాయం, సమాన హక్కులు కల్పించాలనే గొప్ప స్ఫూర్తిని భారత రాజ్యాంగం అందించిందని కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ లక్ష్మీ రాజు నాయక్, ఉపసర్పంచ్ ఎర్ర నాగేశ్వరరావు అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, సమన్యాయం కలగాలనే ఆశయంతో రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. విద్య ద్వారానే అంటరానితనాన్ని నిర్మూలించవచ్చని, చదువుతోనే సమాజంలోని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంబేద్కర్ తన జీవితంతో చాటిచెప్పారని అన్నారు.

భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్, సీనియర్ వార్డు సభ్యులు నూతక్కి సాంబశివరావు, దళితరత్న దైద భద్రయ్య, బాదే వీరభద్రం, రాగం వీరభద్రం, మాజీ వార్డు సభ్యుడు ఇరుగు వెంకన్న, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ వేద, పంచాయతీ సూపర్వైజర్ యాకూబ్ అలీ, సోషల్ మీడియా అధ్యక్షుడు దడిగల రవి తదితరులు పాల్గొన్నారు.