BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 09 October 2026, 09:00 pm
Posted by : KOLA MAHESH

పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
09 Oct, 2026 - 09:00 PM
6 వీక్షణలు

పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం: కోమటిరెడ్డి లక్ష్మి

చౌటుప్పల్‌లో 30 అడుగుల భారీ బతుకమ్మతో ఘనంగా వేడుకలు

చౌటుప్పల్, అక్టోబర్ 9: పూలను దేవతలుగా భావించి పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకు ప్రత్యేకమని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి అన్నారు. బతుకమ్మ వేడుకల ద్వారా ఈ తరం పిల్లలకు పండుగల గొప్పతనం, సంప్రదాయాలు, సంస్కృతిని తెలియజేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 30 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడి, పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలంతా ఒకచోట చేరి భక్తిశ్రద్ధలతో బతుకమ్మను జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకమని అన్నారు. పూర్వీకులు అందించిన సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసేలా ఇలాంటి వేడుకలు నిర్వహించడం సంతోషకరమని తెలిపారు.

దసరా సెలవుల్లో విద్యార్థినులు తమ గ్రామాలకు వెళ్లి నానమ్మలు, అమ్మమ్మలు చెప్పే పాతకాలపు కథలు, ఆచారాలు, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలని సూచించారు. తద్వారా మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని భావితరాలు అర్థం చేసుకోగలవని పేర్కొన్నారు.

దేవుడిచ్చిన శక్తి ఉన్నంతవరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పేదలకు, సమాజానికి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని కోమటిరెడ్డి లక్ష్మి పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ పాలకవర్గ మహిళా సభ్యులు, మహిళా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.