విషయం తెలిసినా పట్టించుకోని ఎంఈఓ?
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో పురుగులు రాళ్లు!
సరిగా ఉడకని గుడ్లు ఎక్స్పైర్ అయిన చిక్కిలు!
ఆ భోజనం తినలేక ఇంటి నుండి క్యారీలు తెచ్చుకుంటున్న పిల్లలు!
ఎంఈఓ ప్రధానోపాధ్యాయులుగా ఉన్న స్కూల్లో ఉదంతం!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రతి స్కూల్లోనూ విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు.
అయితే సాక్షాత్తు పుంగనూరు మండలం లో ఎంఈఓ నటరాజ రెడ్డి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు పిల్లలు తింటున్న మధ్యాహ్నం భోజనం లో రాళ్లు పురుగులు వస్తున్నాయని అలాగే సాంబార్లు ఏమాత్రం తినడానికి బాగా లేవని మాకు ఇస్తున్న చిక్కిలి కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయినవేనని అందువల్లే మా తల్లిదండ్రులకు ,తెలుపగా మాకు ఇంటింటి నుండి క్యారీ తీసుకు వెళ్ళమన్నారని మేజర్ న్యూస్ కు బుధవారం స్కూల్ విద్యార్థులు తెలిపారు. ఇదే విషయమై బసవరాజా స్కూల్ చైర్మన్ వెంకటరమణను వివరణ కోరగా: ఈ విషయం మై గతంలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకు వచ్చారని నేను కూడా ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్లాలని వంటవారిని మార్చమని చెప్పానని రెండు రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు .
Follow us on
Website
Facebook
Instagram
YouTube