BREAKING
చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి
www.ntodaynews.com

దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
17 Apr, 2026 - 03:49 PM
155 వీక్షణలు

దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి, న్యాయ‌బ‌ద్ధ‌మైన డిమాండ్ల‌ను వెంట‌నే అమ‌లు చేయాలి,తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్

రాష్ట్రంలో ఉద్యోగుల‌కు సంబంధించిన దీర్ఘ‌కాలికంగా అనేక స‌మ‌స్య‌లు పెండింగ్‌లో ఉన్నాయి.కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టాక కొన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యాయి.అయిన‌ప్ప‌టికీ మిగ‌తా ఎన్నో స‌మ‌స్య‌లు అలాగే పెండింగ్‌లోనే ఉన్నాయి.ఇవే కాకుండా న్యాయ‌బ‌ద్ద‌మైన డిమాండ్లు సైతం అమ‌లుకు నోచుకోవ‌డం లేదు.ఇదే విష‌యాన్ని వివిధ రూపాల‌లో సీఎస్‌,  ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది.అయిన‌ప్ప‌టికీ వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పంద‌న రాకపోవడంతో  పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని, న్యాయ‌బ‌ద్ధ‌మైన డిమాండ్ల‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ వొడ్నాల రాజ‌శేఖ‌ర్ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రోజున భోజ‌న విరామ స‌మ‌యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని డివిజ‌న్‌, మండ‌ల కేంద్రాల‌లో ఆర్డీఓల‌కు, త‌హ‌శీల్దార్ల‌కు విన‌తిప‌త్రాల‌ను తెలంగాణ రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ (TGRSA) ఆధ్వర్యంలో అందజేశారు బొమ్మలరామారం మండల కేంద్రంలో తాహసిల్దార్ పి. శ్రీనివాసరావుకు తెలంగాణ రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొండం వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు  మండల డిప్యూటీ తాహసిల్దార్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు పరచాలి అని అన్నారు రిటైరైన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలి అని,ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ తక్షణమే అమలు చేయాలి అని అన్నారు  సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలి అని అన్నారు 2004 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి అని, పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలి అని అన్నారు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి అని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి అని అన్నారు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలి అని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి అని అన్నారు ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగిందని అన్నారు ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ(టీజీఈ జేఏసీ) నాయ‌కులు,మండల రెవెన్యూ అధికారులు, జిపిఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు