BREAKING
thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు
Date of Publish : 09 October 2026, 06:05 pm
Posted by : V శ్రీనివాస్

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Oct, 2026 - 06:05 PM
6 వీక్షణలు

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల

హైదరాబాద్: ప్రభుత్వ పాలనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు పారదర్శకంగా అందించడంతో పాటు, ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించేలా సమాచార హక్కు చట్టం–2005ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సూచించారు.


సమాచార హక్కు చట్టం వారోత్సవాలు–2026 సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని వివిధ జిల్లాల సమీకృత కలెక్టరేట్‌లలోని సమావేశ మందిరాల నుంచి అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుభాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, పీసీసీఎఫ్ వినయ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బెనహర్ మహేష్ దత్, రాష్ట్ర సమాచార కమిషన్ ముఖ్య కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలకు సమాచారం అందించడం ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల పనితీరులో జవాబుదారీతనం పెరుగుతాయని పేర్కొన్నారు. చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, పౌర సమాజంపై ఉందన్నారు.


చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా దరఖాస్తులకు సమాధానాలు అందించాలని అధికారులకు సూచించారు. జిల్లా స్థాయిలోనూ చట్టంపై అవగాహన పెంపొందిస్తూ, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.


అనంతరం సమాచార హక్కు చట్టం–2005ను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అమలు చేస్తూ, ప్రజలకు చట్టబద్ధంగా అందించాల్సిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందిస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ శాఖల్లో సమాచార నిర్వహణను మెరుగుపరచడం, ప్రజలకు సమాచారం సులభంగా అందుబాటులో ఉంచడం, చట్టంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.


రాష్ట్ర సమాచార కమిషన్ సేవలు, సమాచార హక్కు చట్టం అమలుకు సంబంధించిన అంశాలను వివరించే ‘సమాచార దర్పణం’ బ్రోచర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా చట్టం అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి అవార్డులు అందజేశారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్ పాండే, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీళ్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.