BREAKING
thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Test 4
Date of Publish : 18 November 2026, 11:07 am
Posted by : PAGADALA DEVAIAH

గిరిజనులకు రావాల్సిన రూ.150 కోట్ల సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
18 Nov, 2026 - 11:07 AM
38 వీక్షణలు

చలో హైదరాబాద్ ధర్నాలో గిరిజన సంఘాల డిమాండ్.. లేకుంటే సీఎం ఇంటి ముట్టడికి హెచ్చరిక

హైదరాబాద్ | నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్):

2018 నుంచి పెండింగ్‌లో ఉన్న గిరిజనుల సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు మంగళవారం హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టారు. ఐఓసీ పరిశ్రమల శాఖ తెలంగాణ స్టేట్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గిరిజనులకు రావాల్సిన సుమారు రూ.150 కోట్ల సబ్సిడీని గత ప్రభుత్వాల నుంచి ప్రస్తుత ప్రభుత్వం వరకు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా పరిపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించడం సరికాదని విమర్శించారు. గిరిజన రైతులు, లబ్ధిదారులకు వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లు, జేసీబీలు, కార్లు, మొబైల్ టిఫిన్ వ్యాన్లు, హిటాచీ యంత్రాలు తదితర యూనిట్లపై మంజూరు కావాల్సిన సబ్సిడీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అవసరమైన కన్సెంట్ లెటర్ల కోసం లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, సబ్సిడీ అందకపోవడంతో ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.150 కోట్ల సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజనులందరినీ ఐక్యం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గిరిజన శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఆందోళనలో తెలంగాణ రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు బంజారా వెంకట్, ఎల్‌హెచ్‌పీఎస్‌కు చెందిన గణేష్ నాయక్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శి బదనాపురం రఘు తదితరులు పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.