BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 16 November 2026, 10:10 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పాత్రికేయుల సేవలు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకం: డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
16 Nov, 2026 - 10:10 PM
4 వీక్షణలు

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కనిగిరి నియోజకవర్గ పాత్రికేయులకు శుభాకాంక్షలు

కనిగిరి (ఎన్ టుడే న్యూస్):

జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కనిగిరి నియోజకవర్గంలోని పాత్రికేయులందరికీ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పాత్రికేయుల సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజంలో చోటుచేసుకునే మంచి, చెడులను విశ్లేషిస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం పాత్రికేయులు చేస్తున్న కృషి గణనీయమైనదని అన్నారు.

ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు, అభిప్రాయాలు, ఆకాంక్షలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లడంలో పత్రికా రంగం కీలక బాధ్యత నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా పత్రికా రంగం నిలుస్తూ, ప్రజల గొంతుకగా పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు.

నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ, సమాజ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న పాత్రికేయులందరికీ మరోసారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. "ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం… ప్రజాగళానికి ప్రతిరూపం పత్రికా రంగం" అని డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ కొనియాడారు.