BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాటు సారా కేసుల్లో ముగ్గురు పాత నేరస్తుల బైండ్ ఓవర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 06:53 PM
4 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు: నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ముగ్గురు పాత నేరస్తులను బైండ్ ఓవర్ చేశారు.

ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పోతనపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు పాత నేరస్తులను చాట్రాయి తహసీల్దార్, మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ జి.శ్వేత ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేశారు.

బైండ్ ఓవర్ ప్రక్రియలో భాగంగా నాటు సారా తయారీ, విక్రయం, రవాణా తదితర ఎక్సైజ్ నేరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ బైండ్ ఓవర్ ఒక సంవత్సరం కాలపరిమితి కలిగి ఉంటుందని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఈ కాలంలో మళ్లీ ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై రూ.1 లక్ష జరిమానా విధించే అవకాశం ఉంటుందని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా రద్దయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

బైండ్ ఓవర్ చేసిన వారిలో

బానవతు విజయ్ కుమార్, తండ్రి రామారావు, పోతనపల్లి

బానవతు ధనలక్ష్మి, భర్త చిన్న వెంకట సీతారామయ్య, పోతనపల్లి

బానవతు రాము, తండ్రి మంచ, పోతనపల్లి

నాటు సారా తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పాత నేరస్తులపై నిఘా కొనసాగించేందుకు ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.