BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 13 October 2026, 09:56 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ధర్మపురిలో పారదర్శకంగా చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 Oct, 2026 - 09:56 PM
7 వీక్షణలు

ధర్మపురిలో పారదర్శకంగా చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

​ధర్మపురి, అక్టోబర్ 13న్యాయం న్యూస్ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'చేయూత పెన్షన్' పథకం అమలులో భాగంగా, దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల అర్హత నిర్ధారణ ప్రక్రియను ధర్మపురి పట్టణంలో పారదర్శకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీఈఓబి. గౌతమ్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు.

​ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి ప్రత్యక్షంగా పాల్గొని అధికారులతో కలిసి దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షించారు.

​ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి చేయూత పెన్షన్ అందించాలనే సత్సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టిందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిగా అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.

​అదేవిధంగా, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ఏ ఒక్క నిజమైన లబ్ధిదారుడూ పెన్షన్‌కు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె ఈ సందర్భంగా ఆదేశించారు.