ప్రకాశం జిల్లాలో విషాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
ఉప్పుగుండూరులో విషాదం.. ఆరవ తరగతి చదువుతున్న బాలల మృతి
ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
ఈ ఘటనలో గ్రామానికి చెందిన కొలకలూరి నిశాంత్, కండ్లగుంట నాగచైతన్య ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ ఆరవ తరగతి చదువుతున్నట్లు సమాచారం. చెరువులో మునిగిపోయిన విద్యార్థుల మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు.
విద్యార్థుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్న వయసులోనే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.