BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 October 2026, 03:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 03:43 PM
2 వీక్షణలు

కరీంనగర్: దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్‌లోని చైతన్యపురి శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భవానీ దీక్ష స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య అమ్మవారి మాలధారణ చేసి, ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సురక్షితంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు బండి సంజయ్ తెలిపారు.

11 రోజుల పాటు కొనసాగనున్న దీక్షలో భాగంగా ఆయన ఆలయంలోనే ఉంటూ అమ్మవారి సేవలో గడపనున్నారు. దీక్షా కాలంలోనూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ సమస్యలపై వినతులు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేశారు.

మరోవైపు దేవీ నవరాత్రి ఉత్సవాలతో శ్రీ మహాశక్తి దేవాలయం భక్తులతో సందడిగా మారింది. భవానీ మాలధారులతో పాటు యువత పెద్ద సంఖ్యలో దీక్షలు స్వీకరిస్తున్నారు. గత 16 ఏళ్లుగా ఈ ఆలయంలో భవానీ దీక్షలు స్వీకరించే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు దర్శన ఏర్పాట్లు చేపట్టారు. ఉచిత ప్రసాద పంపిణీతో పాటు భోజన వసతులు కల్పిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల నిర్వహణను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.