BREAKING
thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ నూతన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా ప్రకటన thumb ● నిరుపేద కుటుంబానికి అండగా అంబేద్కర్ సంక్షేమ సహాయ సంఘం thumb ● పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ thumb ● ఆర్మూర్‌లో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ నూతన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా ప్రకటన thumb ● నిరుపేద కుటుంబానికి అండగా అంబేద్కర్ సంక్షేమ సహాయ సంఘం thumb ● పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ thumb ● ఆర్మూర్‌లో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం
Test 4
Date of Publish : 23 November 2026, 06:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒకే యువతికి ఇద్దరు భర్తలు.. పెళ్లి పేరుతో రూ.15 లక్షల మోసం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:28 PM
9 వీక్షణలు

దీపావళికి భార్య ఇంటికి రాకపోవడంతో అనుమానం.. ఇంటికి వెళ్లిన ఇద్దరు భర్తలకు విస్తుపోయే నిజం

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ వింత వివాహ మోసం ఘటన కలకలం రేపుతోంది. ఒకే యువతి ఇద్దరు వ్యక్తులను వేర్వేరుగా వివాహం చేసుకుని, పెళ్లి ఖర్చుల పేరుతో సుమారు రూ.15 లక్షలు మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు ఇద్దరు భర్తలు ఒకే ఇంటి వద్ద ఎదురుపడటంతో అసలు విషయం బయటపడింది.

కోవిల్‌పట్టికి చెందిన 23 ఏళ్ల కార్తికకు, తంజావూరుకు చెందిన 36 ఏళ్ల సిద్ధార్థన్‌తో సెప్టెంబర్ 13న ఘనంగా వివాహం జరిగింది. ఈ వివాహం కోసం మధ్యవర్తులకు రూ.3 లక్షలు చెల్లించడంతో పాటు, వధువుకు మూడు సవర్ల బంగారు ఆభరణాలు అందించినట్లు సిద్ధార్థన్ కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తం మీద వివాహానికి సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

అయితే పెళ్లయిన రెండో రోజే తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పిన కార్తిక కోవిల్‌పట్టికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త ఇంటికి తిరిగి రాలేదు. దీపావళి పండుగకు కూడా భార్య రాకపోవడంతో అనుమానం వచ్చిన సిద్ధార్థన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ కార్తిక కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు.

ఇదే సమయంలో నామక్కల్‌కు చెందిన 37 ఏళ్ల రంజిత్‌కుమార్ కూడా అక్కడికి చేరుకున్నాడు. నవంబర్ 1న కోవిల్‌పట్టిలోని ఓ ఆలయంలో కార్తికను తాను వివాహం చేసుకున్నానని, ఆమె కోసం వెతుకుతున్నానని చెప్పడంతో సిద్ధార్థన్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒకే యువతిని ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్న విషయం అక్కడ బయటపడింది.

కార్తిక తల్లిదండ్రులమని చెప్పుకున్న మునీశ్వరి, మారియప్పన్‌లను ఇద్దరూ ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. మొదట తాను మధ్యవర్తినని చెప్పిన మారియప్పన్, ఆ తర్వాత మునీశ్వరి భర్తనని చెప్పుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్తిక తన బామ్మను చూడటానికి తూత్తుకుడి ఆసుపత్రికి వెళ్లిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.

దీంతో తాము పెళ్లి పేరుతో మోసపోయామని భావించిన సిద్ధార్థన్, రంజిత్‌కుమార్‌లు కోవిల్‌పట్టి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కార్తిక, మారియప్పన్, మునీశ్వరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు కలిసి మరికొందరిని కూడా ఇదే తరహాలో వివాహాల పేరుతో మోసం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.