BREAKING
thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం!
Test 4
Date of Publish : 23 November 2026, 05:41 pm
Posted by : NUNE SRIKANTH

గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
23 Nov, 2026 - 05:41 PM
8 వీక్షణలు

అర్హులైన గ్రామస్తులందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ అప్పల గణేష్

ఆర్మూర్: ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ గ్రామంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు గ్రామ సర్పంచ్ అప్పల గణేష్ తెలిపారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో బీమా పథకానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పథకం వివరాలను తెలియజేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అప్పల గణేష్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ బీమా పథకాన్ని గ్రామంలోని అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీమా నమోదు చేసుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. అవసరమైన పత్రాలతో గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి బీమా నమోదు చేసుకోవాలని కోరారు.

గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అప్పల గణేష్‌తో పాటు గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.