BREAKING
thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు
Test 4
Date of Publish : 23 November 2026, 04:47 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
23 Nov, 2026 - 04:47 PM
8 వీక్షణలు

235 మంది లబ్ధిదారులకు రూ.2.27 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందజేత

జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించడం వల్ల వారి కష్టాల్లో కొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

సోమవారం జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్‌తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పట్టణానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన రూ.17,04,500 విలువైన చెక్కులను అందజేశారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అర్హత పొందిన 180 మంది ఆడబిడ్డలకు రూ.2 కోట్ల 10 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

మొత్తంగా 235 మంది లబ్ధిదారులకు రూ.2,27,04,500 విలువైన ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒకవైపు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా, మరోవైపు ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సమీండ్ల వాణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, తహసీల్దార్ రామ్మోహన్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పట్టణ నాయకులు, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.