BREAKING
thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం
Test 4
Date of Publish : 23 November 2026, 04:25 pm
Posted by : PAGADALA DEVAIAH

శారద నగర్ డ్రైనేజీ సమస్యపై క్షేత్రస్థాయి పరిశీలన

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
23 Nov, 2026 - 04:25 PM
6 వీక్షణలు

నూతన డ్రైనేజీ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని జలమండలి అధికారులకు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి వినతి

ఎల్బీనగర్, నవంబర్ 23 (ఎన్ టుడే న్యూస్): గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని శారద నగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం కాలనీలో ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్ సామర్థ్యం సరిపోకపోవడంతో మురుగునీటి సమస్య తరచూ తలెత్తుతోందని కాలనీవాసులు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.

కాలనీవాసుల విజ్ఞప్తిపై స్పందించిన బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం శారద నగర్ కాలనీలో పర్యటించారు. సంబంధిత సిబ్బందితో కలిసి డ్రైనేజీ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పైప్‌లైన్ సామర్థ్యం సరిపోకపోవడం వల్ల మురుగునీటి సమస్య ఏర్పడుతోందని స్థానికులు ఆయనకు వివరించారు.

అనంతరం కాలనీవాసులతో కలిసి జలమండలి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ డీజీఎం చంద్ర నాయక్‌ను కలిసి శారద నగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను వివరించారు. ప్రస్తుత పైప్‌లైన్ స్థానంలో అధిక సామర్థ్యం కలిగిన నూతన డ్రైనేజీ పైప్‌లైన్ ఏర్పాటు చేయడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

కాలనీవాసుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన డీజీఎం చంద్ర నాయక్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉంటూ, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. శారద నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా జలమండలి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శారద నగర్ కాలనీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కాలనీవాసులు శివరామయ్య, విశ్వం, గోపాల్, వినోద్, కాచం శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.