BREAKING
thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు
Test 4
Date of Publish : 23 November 2026, 04:35 pm
Posted by : ఆనంద్ రెడ్డి

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
ఆనంద్ రెడ్డి కీసర డివిజన్ ప్రతినిధి
23 Nov, 2026 - 04:35 PM
9 వీక్షణలు

123 దరఖాస్తులు స్వీకరణ.. ఆన్‌లైన్‌లో చర్యల వివరాలు నమోదు చేయాలని అధికారులకు ఆదేశం

మేడ్చల్ మల్కాజిగిరి: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 123 దరఖాస్తులను స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చే అర్జీదారుల వినతులను అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదని సూచించారు.

అలాగే ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యల వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో డీఆర్ఓ మాలతి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.