BREAKING
thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు
Test 4
Date of Publish : 23 November 2026, 04:52 pm
Posted by : PAGADALA DEVAIAH

ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
23 Nov, 2026 - 04:52 PM
6 వీక్షణలు

సీపీఐ ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా.. ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం

ఆలేరు, నవంబర్ 23 (ఎన్ టుడే న్యూస్): ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు కేటాయించి, పట్టాలు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలు తమకు నివాస స్థలాలు కల్పించాలని అధికారులను కోరుతూ ఆందోళన చేపట్టాయి.

ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరైనప్పటికీ తమకు ఇళ్లు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుడిసెలు వేసుకుని జీవనోపాధి సాగిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వ భూమిలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి, పట్టాలు మంజూరు చేయాలని కన్నీటిపర్యంతమవుతూ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా బాధితురాలు గంజి సుశీల మాట్లాడుతూ.. తాము గుడిసెల్లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వంలోనైనా తమకు ఇంటి స్థలాలు కేటాయించి నివాస సౌకర్యం కల్పించాలని కోరారు. నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి స్థలం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు తమ సమస్యపై ఎమ్మార్వో, ఎంపీడీవోలకు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యను పరిశీలించి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని కోరారు.