BREAKING
thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు
Test 4
Date of Publish : 23 November 2026, 03:52 pm
Posted by : K MAHESH

జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 03:52 PM
10 వీక్షణలు

చౌటుప్పల్–నారాయణపూర్ ప్రధాన రహదారిపై రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బడే సాబ్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా

రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని పోలీసుల హామీ.. ధర్నా విరమణ

సంస్థాన్ నారాయణపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం గుడిమల్కాపూర్ గ్రామంలో తురక కాశ సంక్షేమ సంఘం జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులు ఎదురవుతున్నాయని సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సంఘం జెండా దిమ్మె ఏర్పాటు విషయంలో స్థానికంగా కొందరు ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బడే సాబ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్–నారాయణపూర్ ప్రధాన రహదారిపై మెరుపు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బడే సాబ్ మాట్లాడుతూ.. తురక కాశ సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సంఘం జెండా దిమ్మె ఏర్పాటును అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. సమాజ ఐక్యతను దెబ్బతీసే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. తమ సంఘానికి సంబంధించిన జెండా దిమ్మె ఏర్పాటు చేసుకునే హక్కు కోసం తురక కాశ సమాజం ఐక్యంగా పోరాటం చేస్తుందని తెలిపారు.

ధర్నా విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై, సీఐలు సంఘటనా స్థలానికి చేరుకుని సంఘం నాయకులతో చర్చలు జరిపారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి, జెండా దిమ్మెను తామే స్వయంగా ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.

పోలీసు అధికారులు ఇచ్చిన హామీని స్వాగతించిన రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బడే సాబ్ ధర్నాను విరమించారు. ఈ హామీతో తాత్కాలికంగా నిరసన ముగిసింది. ఇచ్చిన గడువులో సమస్య పరిష్కారం కావాలని సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్.కె. లతీఫ్, ఇస్మాయిల్, సాహెబ్, హుస్సేన్, రఫీ, నజీర్, మోయినుద్దీన్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు యూసుఫ్ తదితర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో తురక కాశ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.