BREAKING
thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం
Test 4
Date of Publish : 23 November 2026, 03:16 pm
Posted by : PABBINEEDI B SANKAR

విజయవంతంగా ముగిసిన రాకేష్ కన్నెస్వామి దివ్యజ్యోతి మహా పాదయాత్ర

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
23 Nov, 2026 - 03:16 PM
8 వీక్షణలు

అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం కొల్లూరు రవి గురుస్వామి ఆధ్వర్యంలో ఘన సన్మానం

తెల్లాపూర్: తెల్లాపూర్ పరిసర ప్రాంతంలోని వట్టినాగులపల్లికి చెందిన రాకేష్ కన్నెస్వామి చేపట్టిన దివ్యజ్యోతి మహా పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. అక్టోబర్ 14న ప్రారంభమైన ఈ పాదయాత్ర నవంబర్ 21న పూర్తయింది. పాదయాత్రను విజయవంతంగా ముగించుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రాకేష్ కన్నెస్వామికి కొల్లూరు రవి గురుస్వామి ఆధ్వర్యంలోని సన్నిధానంలో ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా రవి గురుస్వామి మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామిపై అపారమైన భక్తి, విశ్వాసంతో మహా పాదయాత్ర చేపట్టి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. కఠినమైన ప్రయాణాన్ని భక్తిశ్రద్ధలతో పూర్తి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఒక కన్నెస్వామి ఇంతటి మహా పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం సంతోషకరమని తెలిపారు.

అలాంటి భక్తుడిని తమ సన్నిధానంలో ఘనంగా సన్మానించే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని రవి గురుస్వామి అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు రాకేష్ కన్నెస్వామిపై ఎల్లప్పుడూ ఉండాలని, భవిష్యత్తులోనూ మరింత భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో సన్నిధానంలోని అయ్యప్ప స్వాములు, గురుస్వాములు, స్థానికులు పాల్గొని రాకేష్ కన్నెస్వామిని అభినందించారు.