BREAKING
thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం!
Test 4
Date of Publish : 23 November 2026, 06:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఖమ్మం గడ్డపై నవంబర్ 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:01 PM
17 వీక్షణలు

కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర విమర్శలు శ్రీకాంతాచారి బలిదానానికి కాంగ్రెస్ పార్టీనే కారణం శంకరమ్మపై రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు

ఖమ్మం, నవంబర్ 23: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అంకురార్పణ జరిగిన ఖమ్మం గడ్డపై నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఉద్యమకారుల త్యాగాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. నాడు కేసీఆర్ వరంగల్‌లో దీక్ష చేపడితే ఉత్తర తెలంగాణ అంతటా ఉద్యమం ఉధృతమవుతుందనే ఉద్దేశంతో సమైక్య ప్రభుత్వం ఆయనను బలవంతంగా ఖమ్మంకు తరలించిందని పువ్వాడ పేర్కొన్నారు. ఖమ్మంలో ఉద్యమ ప్రభావం తక్కువగా ఉంటుందని భావించినప్పటికీ, ఇక్కడి ప్రజలు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులతో పాటు వామపక్ష పార్టీలు, సీపీఐ ఎంఎల్ నాయకులు సైతం కేసీఆర్ దీక్షకు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. దీక్ష కొనసాగుతున్న సమయంలో కేసీఆర్‌కు బలవంతంగా సెలైన్ ఎక్కించే ప్రయత్నాలను ఆయన ప్రతిఘటించారని, ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేయడానికి ఈ దీక్ష ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం జరిగిన ఉద్యమ పరిణామాల్లో అనేకమంది ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి బలిదానానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని పువ్వాడ ఆరోపించారు. ఉద్యమ సమయంలో 1,400 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు స్పందించని రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడటం ఏమిటని విమర్శించారు. శ్రీకాంతాచారి త్యాగాన్ని, శంకరమ్మ పోరాటాన్ని ప్రస్తావిస్తూ, గతంలో హుజూర్‌నగర్ ఉపఎన్నికలో శంకరమ్మపై పోటీ చేసి ఓడించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యమకారులపై రైఫిళ్లు ఎక్కుపెట్టిన చరిత్ర ఉన్నవారు నేడు తెలంగాణ ఉద్యమ త్యాగాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని అన్నారు. 371(డి) రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా స్థానికులకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానం కొనసాగిందని పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. సీతారామ ప్రాజెక్టును తామే నిర్మించినట్లు ప్రచారం చేసుకున్న ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లు గడిచినా పనులు పూర్తి చేయలేదని పువ్వాడ విమర్శించారు. బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడం, పనులను ముందుకు తీసుకెళ్లకపోవడం వల్ల ఖమ్మం జిల్లాకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఉద్యమకారుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్న ఆయన, ఖమ్మం నియోజకవర్గానికి దీక్షా దివస్ నిర్వహణలో ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నవంబర్ 29న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.