BREAKING
thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం!
Test 4
Date of Publish : 23 November 2026, 05:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెద్ద కొమిరలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 05:59 PM
32 వీక్షణలు

వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి భారత ప్రపంచ పటాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి విషయ నిపుణులు కేశవరావు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెద్ద కొమిరలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సోమవారం స్థానిక సమీకృత సంక్షేమ వసతి గృహంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో సాంఘిక శాస్త్ర విషయ నిపుణులు, ఏ. కొండూరు మండల విద్యాశాఖ అధికారి ఈ.ఎల్.సి. కేశవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో సాంఘిక శాస్త్రంలో మంచి మార్కులు సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వర్తమాన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. భారతదేశ, ప్రపంచ పటాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠ్యాంశాలను క్రమం తప్పకుండా చదువుతూ ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి. జ్యోతిలక్ష్మీ దేవి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని, పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు ఎం. రాంప్రదీప్, ఎల్. గంగాధర్, డి. సుదర్శన్, బి. సైదులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారిణి గాయత్రి తదితరులు పాల్గొన్నారు.