BREAKING
thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం!
Test 4
Date of Publish : 23 November 2026, 05:55 pm
Posted by : PEDDABOINA SRIKANTH

గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి

తెలంగాణ
/ వరంగల్
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
23 Nov, 2026 - 05:55 PM
16 వీక్షణలు

శిలాఫలకాలపై వార్డు సభ్యుల పేర్లు ముద్రించాలి.. మరణించిన వార్డు సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి

వరంగల్ జిల్లా, నవంబర్ 23: గ్రామపంచాయతీ వార్డు సభ్యుల సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణతో పాటు గ్రామ అభివృద్ధిలో వారికి పూర్తి భాగస్వామ్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరమ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు నాగబల్లి జ్యోతి వరంగల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఫోరమ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల పాలనలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు అత్యంత కీలకమైన ప్రజాప్రతినిధులని పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటూ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వార్డు సభ్యులకు తగిన గుర్తింపు, గౌరవం, సంక్షేమ ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో వార్డు సభ్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. ప్రధానంగా వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలపై స్థానిక వార్డు సభ్యుల పేర్లను ప్రోటోకాల్ ప్రకారం తప్పనిసరిగా ముద్రించాలని కోరారు.

అలాగే, వార్డు సభ్యుడిగా పదవిలో కొనసాగుతున్న సమయంలో అనారోగ్య కారణాలతో మరణించినట్లయితే వారి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.

గ్రామ అభివృద్ధి పనుల్లో వార్డు సభ్యులకు పూర్తి భాగస్వామ్యం కల్పించాలని, గ్రామసభలు, నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల ఎంపిక, పనుల పర్యవేక్షణలో వారికి తగిన అధికారాలు, ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

వార్డు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో పరిశీలించి, తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని నాగబల్లి జ్యోతి కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో ఫోరమ్ కార్యవర్గ సభ్యులు మహేష్, ఎర్రోళ్ల చైతన్యకుమార్, నాగరాజ్, దిలీప్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.