BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి
Test 4
Date of Publish : 23 November 2026, 07:06 pm
Posted by : A. MURALIDHAR

నిరుపేద కుటుంబానికి అండగా అంబేద్కర్ సంక్షేమ సహాయ సంఘం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
23 Nov, 2026 - 07:06 PM
13 వీక్షణలు

మృతుడి అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం

అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి అంబేద్కర్ సంక్షేమ సహాయ సంఘం మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామానికి చెందిన సిద్దప్ప మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం సంఘం సభ్యులు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

కుటుంబ పెద్దను కోల్పోయి విషాదంలో ఉన్న మృతుడి భార్య రెడ్డెమ్మ అంత్యక్రియల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో అంబేద్కర్ సంక్షేమ సహాయ సంఘం సభ్యులను సంప్రదించి సహాయం కోరారు. దీనిపై స్పందించిన సంఘం సభ్యులు వెంటనే ముందుకు వచ్చి రూ.5,000 అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా మునుస్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలు, సమానత్వ భావన, సామాజిక బాధ్యతలను ఆదర్శంగా తీసుకుని సంఘం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. గతంలోనూ పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని సంఘం సభ్యులు తెలిపారు.

ఈ సహాయ కార్యక్రమంలో నందకుమార్ రెడ్డి, మునుస్వామి, ఆవులపాటి రాజేంద్ర, ఆవులపాటి మురళీధర్, మణి, జయప్ప, బయప్ప, ప్రేమరాజు, రెడ్డెప్ప, చెంగప్ప తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న కుటుంబానికి సంఘం సభ్యులు అందించిన ఆర్థిక సహాయంపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మానవతా విలువలను పెంపొందించేందుకు సంఘం చేస్తున్న కృషిని ప్రశంసించారు.