BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 04:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బాపట్లలో పెళ్లింట తీరని విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్
/ బాపట్ల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 04:27 PM
27 వీక్షణలు

 వివాహ వేడుక జరిగిన రెండో రోజే మృత్యుఘోష.. పెళ్లికొడుకు క్షేమం.. పెళ్లికూతురుకు తీవ్ర గాయాలు బాపట్ల: పెళ్లి బాజాలతో కళకళలాడిన ఆ ఇంట్లో అంతలోనే విషాదం అలుముకుంది. నిన్నటి వరకు బంధుమిత్రుల సందడి, పెళ్లి వేడుకలతో ఆనందంగా గడిపిన కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వివాహ వేడుక ముగిసిన రెండో రోజే జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులతో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. బాపట్ల జిల్లా నరాలశెట్టివారిపాలెంకు చెందిన జంపాల వెంకట్రావు, సుజాత దంపతులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. వీరితో పాటు కారు డ్రైవర్ ప్రవీణ్, మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీన బాపట్లలోని కమ్మ కళ్యాణ మండపంలో జంపాల కుటుంబంలో వివాహ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీతేజ, వధువు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఆనందోత్సాహాలతో జరిగిన వేడుకతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఆ ఆనందం ఎంతోకాలం నిలవకముందే ఊహించని ప్రమాదం కుటుంబాన్ని కుదిపేసింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా, పెళ్లికొడుకు శ్రీతేజ క్షేమంగా బయటపడినట్లు సమాచారం. పెళ్లికూతురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు కొత్త దంపతుల జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులు, మరోవైపు అదే కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదంతో కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లి సందడి ఇంకా మరువకముందే నాలుగు ప్రాణాలు గాలిలో కలవడంతో నరాలశెట్టివారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.