BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 01 August 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడీ, ఆశ వర్కర్లు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 05:13 AM
40 వీక్షణలు

విజయవాడ: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు విజయవాడ కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.