BREAKING
thumb ● టీపీసీసీ అధికార ప్రతినిధిగా వంగాల వెంకన్న గౌడ్ నియామకం thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● టీపీసీసీ అధికార ప్రతినిధిగా వంగాల వెంకన్న గౌడ్ నియామకం thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్
Test 4
Date of Publish : 10 November 2026, 08:04 am
Posted by : K MAHESH

టీపీసీసీ అధికార ప్రతినిధిగా వంగాల వెంకన్న గౌడ్ నియామకం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 08:04 AM
8 వీక్షణలు

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర.. పార్టీ విధేయతకు గుర్తింపుగా కీలక బాధ్యత

వలిగొండ, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వంగాల వెంకన్న గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించింది.

వంగాల వెంకన్న గౌడ్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్‌ఎస్‌యూఐలో పనిచేస్తూ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలుమార్లు పోలీసుల లాఠీ దెబ్బలకు గురికావడంతో పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో ఆయన చేసిన కృషి ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది.

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా కొనసాగుతూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయన రాజకీయ అనుభవం, ఉద్యమ నేపథ్యం, పార్టీ పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకున్న పార్టీ నాయకత్వం టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నియామకంపై వంగాల వెంకన్న గౌడ్ స్పందిస్తూ తనకు ఈ బాధ్యతను అప్పగించిన ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, అధికార ప్రతినిధిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

వంగాల వెంకన్న గౌడ్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించడంపై వలిగొండ మండల కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, నాగారం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, ఈ నియామకం పార్టీకి మరింత ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.