BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 09:20 pm
Posted by : NAGARAJU GADE

ప్రజల నమ్మకమే మా బలం.. కూటమి విజయమే మా బాధ్యత: కొల్ల అప్పలనాయుడు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
09 Nov, 2026 - 09:20 PM
7 వీక్షణలు

సంతకవిటి మండలంలో జడ్పీటీసీతో పాటు 15 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి విజయం

రానున్న పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా మరింత ఐక్యంగా ముందుకు సాగుతాం

సంతకవిటి (ఎన్ టుడే న్యూస్):

స్థానిక ఎన్నికల్లో సంతకవిటి మండలంలో కూటమి సాధించిన ఘన విజయం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు అన్నారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ప్రజలు కూటమిపై, ప్రభుత్వ పాలనపై ఉంచిన విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు.

సంతకవిటి మండలంలో ఒక జడ్పీటీసీ, 19 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, జడ్పీటీసీ స్థానంతో పాటు 15 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించడం ప్రజల ఆదరణను తెలియజేస్తోందని అన్నారు. ఈ ఫలితాలు కూటమి నాయకులు, కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు.

ఈ విజయం ఒక్కరి కృషితో సాధ్యమైనది కాదని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా చేసిన కృషి ఫలితమని కొల్ల అప్పలనాయుడు తెలిపారు. ప్రతి కార్యకర్త చూపిన పట్టుదల, ప్రతి నాయకుడు అందించిన సహకారం, ప్రజలు కూటమిపై చూపిన ఆదరణ విజయానికి ప్రధాన కారణమని పేర్కొంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు బీజేపీ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ విజయం కేవలం రాజకీయ విజయంగా మాత్రమే చూడటం లేదని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతను మరింత పెంచిన ప్రజాతీర్పుగా భావిస్తున్నామని అన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కూటమి శ్రేణులన్నీ మరింత ఐక్యంగా, బలంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సంతకవిటి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన సంకల్పమని కొల్ల అప్పలనాయుడు స్పష్టం చేశారు.