BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

2027లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్‌పై ఈసీ కసరత్తు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Nov, 2026 - 08:40 PM
24 వీక్షణలు

జనవరి తొలి లేదా రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం

దేశంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొననుంది. 2027లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2027 జనవరి మొదటి లేదా రెండో భాగంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియతో పాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) తనిఖీలను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. అయితే ఎన్నికల తేదీలు, పూర్తి షెడ్యూల్‌పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.