BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:28 pm
Posted by : K MAHESH

ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా?

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:28 PM
15 వీక్షణలు
  • కాల్వ పక్కనే మట్టి, చెత్తాచెదారం వేస్తున్న కాంట్రాక్టర్లు.. వర్షాలకు తిరిగి కాల్వలోకి చేరే ప్రమాదం
  • పనులపై పర్యవేక్షణ కరువు.. చోద్యం చూస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు?

నెల్లికుదురు, నవంబర్ 09 (ఎన్ టుడే న్యూస్):

రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఎస్సారెస్పీ కాల్వల పూడికతీత పనులు క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాల్వల్లో పేరుకుపోయిన మట్టిని, ముళ్ల చెట్లను తొలగిస్తున్న కాంట్రాక్టర్లు వాటిని కాల్వకు దూరంగా తరలించకుండా పక్కనే వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పూడికతీత పనులు చేపడుతున్నారా? లేక తొలగించిన మట్టిని మళ్లీ కాల్వలోకి చేరేలా చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్సారెస్పీ జలాలతో ప్రతి చెరువును నింపి, గ్రామాల్లోని రైతుల పంట పొలాలకు సాగునీరు అందించి వారి ముఖాల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సారెస్పీ కాల్వల పూడికతీత పనులకు నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా నెల్లికుదురు మండలంలోని ఎస్సారెస్పీ డీబీఎం 48-10ఆర్ ఉపకాల్వకు సంబంధించిన చెట్ల తొలగింపు, పూడికతీత పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆలేరు వద్ద ప్రారంభించారు.

అయితే పనులు ప్రారంభమైనప్పటికీ కాంట్రాక్టర్లు వాటిని నిబంధనల ప్రకారం నిర్వహించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలోని మట్టి, చెట్లు, ఇతర వ్యర్థాలను తొలగించిన అనంతరం కాల్వకు దూరంగా తరలించాల్సి ఉండగా, వాటిని కాల్వకు ఆనుకునే వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తొలగించిన మట్టి, ముళ్ల చెట్లు కాల్వ పక్కనే పేరుకుపోతే రాబోయే వర్షాలకు అవి తిరిగి కాల్వలోకి చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు ఆశించిన ప్రయోజనాన్ని అందించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

కాల్వ భూముల ఆక్రమణలపై పట్టింపు లేదా?

మరోవైపు కొంతమంది రైతులు కాల్వకు సంబంధించిన స్థలాలను ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నప్పటికీ సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాల్వల హద్దులు, నీటి ప్రవాహానికి అవసరమైన స్థలాన్ని పరిరక్షించాల్సిన అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి పూడికతీత పనులు చేపడుతున్నప్పటికీ, వాటి నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ చేయడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉన్నతాధికారులు స్పందించాలి.. రైతుల డిమాండ్

ఇప్పటికైనా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఎస్సారెస్పీ కాల్వల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. తొలగించిన మట్టి, ముళ్ల చెట్లను కాల్వకు దూరంగా తరలించి, భవిష్యత్తులో తిరిగి కాల్వలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాల్వల ఆక్రమణలపై కూడా విచారణ జరిపి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

పనుల నాణ్యత, నిర్వహణలో నిర్లక్ష్యం కొనసాగితే ఆందోళన చేపడతామని ప్రతిపక్ష నాయకులు హెచ్చరించారు. రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పనులు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.