BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:30 pm
Posted by : K MAHESH

కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:30 PM
11 వీక్షణలు

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి

విద్యుత్, తాగునీరు, వైద్య సేవలు, రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్

కురవి, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

ఈ నెల 24వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా కందగిరి పర్వతంపై నిర్వహించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ అధికారులను ఆదేశించారు. ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సోమవారం కురవి మండలంలోని కందగిరి పర్వతం వద్ద సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లపై చర్చించి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

కల్యాణ మహోత్సవం సందర్భంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల పాటు విద్యుత్ అందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవానికి వచ్చే భక్తులు, ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల మందులు, వైద్య సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని కురవి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనికకు సూచించారు.

అదేవిధంగా మిషన్ భగీరథ అధికారులు భక్తులకు సరిపడా తాగునీటి సదుపాయం కల్పించాలని, అటవీ శాఖ అధికారులు కందగిరి పర్వతం పరిసరాల్లో అవసరమైన చోట చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనులు చేపట్టాలని తెలిపారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రవాణా సదుపాయాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టి కల్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కందగిరి పర్వతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి కే. వీరబాబు, తహసీల్దార్ విజయ, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం, జిల్లా కోశాధికారి గార్లపాటి వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుధాకర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్, ఆలయ చైర్మన్ కోర్ని రవీందర్ రెడ్డి, జిల్లా యువజన నాయకులు, ఎమ్మెల్సీ మండల కన్వీనర్ గార్లపాటి భరత్, బాజిరెడ్డి, టీపీసీసీ హెల్త్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వీరన్న నాయక్, సీనియర్ నాయకులు బాధావత్ రాము నాయక్, మరిపెడ మండల పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సర్పంచులు తోడుసు నాగార్జున, జక్కుల మాధవి నాగన్న, ఉప సర్పంచ్ చందు, జీపీఓ ప్రియాంక, అటవీ, విద్యుత్, ఆర్టీసీ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.