BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:26 pm
Posted by : K MAHESH

35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:26 PM
8 వీక్షణలు

విద్యా విజ్ఞాన రంగంతో పాటు సామాజిక అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపు

మహబూబాబాద్, నవంబర్ 09 (ఎన్ టుడే న్యూస్):

గార్ల మండలానికి చెందిన ప్రముఖ రచయిత, కవి, జర్నలిస్టు, విశ్రాంత ఉపాధ్యాయుడు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ లభించింది. విద్యా విజ్ఞాన రంగంతో పాటు సామాజిక అభివృద్ధికి గత 35 ఏళ్లుగా ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబ్బిక్ యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేశారు.

ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు బోధన అందించడంతోపాటు, సామాజిక విద్య, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లోనూ పంజాల ఐలయ్య చురుకుగా పాల్గొన్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. కేవలం తరగతి గది బోధనకే పరిమితం కాకుండా సమాజంలో విద్యా విజ్ఞానాన్ని పెంపొందించేందుకు, సామాజిక అభివృద్ధికి తనవంతు కృషి చేసినట్లు తెలిపారు. ఈ సేవలను పరిగణనలోకి తీసుకొని ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచార్యులు, రామకృష్ణ ఉప్పల, శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా పంజాల ఐలయ్య ఈ గౌరవాన్ని అందుకున్నారు.

గార్ల మండలానికి చెందిన పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కడం సంతోషకరమని పేర్కొంటూ అభినందనలు తెలిపారు.