BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:33 pm
Posted by : K MAHESH

వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం

తెలంగాణ
/ మహబూబ్ నగర్ / మహబూబ్ నగర్ (రూరల్)
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:33 PM
18 వీక్షణలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్‌పీఆర్‌డీ కార్యకర్తల బైండోవర్‌పై తీవ్ర అభ్యంతరం
పోరాట ఫలితంగానే కొత్త పెన్షన్ల మంజూరు

బైండోవర్ నోటీసులను తక్షణమే ఎత్తివేయాలి: ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్

యాదాద్రి భువనగిరి (ఎన్ టుడే న్యూస్):

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) నాయకులు, కార్యకర్తలకు బైండోవర్ నోటీసులు జారీ చేయడాన్ని ఎన్‌పీఆర్‌డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వెంటనే బైండోవర్ చర్యలను ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం పనిచేస్తున్న సంఘం నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బైండోవర్ చేయడం సరైన చర్య కాదని విమర్శించారు. వికలాంగుల పెన్షన్లు పెంచలేని ముఖ్యమంత్రికి వారిని బైండోవర్ చేయించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిరక్షణను ప్రకటించిన ప్రభుత్వం, ప్రస్తుతం బైండోవర్ చర్యలకు పాల్పడటమేనా ప్రజాస్వామ్య పరిరక్షణ అని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న విధానాలకు పొంతన లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వికలాంగులను బైండోవర్ చేయించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్‌పీఆర్‌డీ నాయకులు, కార్యకర్తలపై జారీ చేసిన బైండోవర్ నోటీసులను తక్షణమే ఎత్తివేయాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

గత మూడేళ్లుగా కొత్త పెన్షన్ల మంజూరు కోసం ఎన్‌పీఆర్‌డీ నిర్వహించిన పోరాటాల ఫలితంగానే నవంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై నిర్ణయం తీసుకుందని వనం ఉపేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్ల కోసం సుమారు 50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

దసరా సందర్భంగా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సుమారు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, అయితే వీరిలో 4 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ సభలో ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అన్ని జిల్లాల్లో వెంటనే కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని కోరారు. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి, లబ్ధిదారులకు వాటిని అందించకపోతే ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ ప్రకటనలో ఎన్‌పీఆర్‌డీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు స్వరూపంగా ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా ఉపాధ్యక్షుడు చిత్తలూరి శ్రీహరి పాల్గొన్నారు.