BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:29 pm
Posted by : K MAHESH

అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:29 PM
10 వీక్షణలు

పారదర్శకంగా సర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలి: సీపీఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు

నెల్లికుదురు, అక్టోబర్ 09 (ఎన్ టుడే న్యూస్):

మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వం కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు మాత్రమే అందించాలని సీపీఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు అధికారులను కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేపట్టి నిజమైన అర్హులను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

అనంతరం సైదులు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో సొంత ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కొంతమందికి ఇంటి స్థలాలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఇళ్లను నిర్మించుకోలేక కిరాయి ఇళ్లలో నివసిస్తున్నారని తెలిపారు. అలాంటి కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

లబ్ధిదారుల ఎంపిక సమయంలో కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, నివాస పరిస్థితులు, సొంత ఇల్లు ఉందా లేదా అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు.

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను అధికారులు మరోసారి సమీక్షించాలని, అర్హులైన పేదలకు ప్రాధాన్యతనిస్తూ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత లేని వారికి ఇళ్లు మంజూరు చేసి, నిజమైన నిరుపేదలకు అన్యాయం జరిగితే పేదలతో కలిసి నిరాహార దీక్షలు చేపడతామని ఇసంపల్లి సైదులు హెచ్చరించారు.