BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:24 pm
Posted by : K MAHESH

గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:24 PM
12 వీక్షణలు

గ్రామపంచాయతీ పాలకవర్గం, ప్రజల మధ్య పండుగ సంబరాలు.. మిఠాయిల పంపిణీ

కేసముద్రం, నవంబర్ 09 (ఎన్ టుడే న్యూస్):

కేసముద్రం మండలం పెద్దమోరి తండా కొత్తూరు గ్రామపంచాయతీలో దీపావళి వేడుకలను గ్రామ ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సారంపల్లి దేవేంద్ర మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల మధ్య పండుగ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

దీపావళి పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి మాట్లాడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో, పరస్పర స్నేహభావంతో పండుగను జరుపుకోవాలని గ్రామస్తులకు సూచించారు.

ఈ దీపావళి పర్వదినం పెద్దమోరి తండా కొత్తూరు గ్రామంతోపాటు కేసముద్రం మున్సిపాలిటీ, మండల ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని, పాడిపంటలతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, కేసముద్రం మున్సిపాలిటీ, మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం సర్పంచ్ గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆలు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.