BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:25 pm
Posted by : K MAHESH

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:25 PM
15 వీక్షణలు

లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

కేసముద్రం, నవంబర్ 09 (ఎన్ టుడే న్యూస్):

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం విలేజ్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారుల దంపతులకు స్వీట్లు పంపిణీ చేసి పండుగ సంబరాల్లో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, వారి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం కల అని, ఆ కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కావడం సంతోషకరమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండగా నిలుస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం విలేజ్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు కత్తెరసాల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కీర్తి సురేందర్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాసాడి శ్రీనివాస్, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు అజ్మీర రమేష్, సొసకన్ల సుభాష్ రెడ్డి, కీర్తి శ్రీలత, చిట్ల సులోచన, హౌసింగ్ ఏఈ అభినయ్ గౌడ్, మున్సిపల్ వార్డు ఆఫీసర్ కృష్ణమూర్తి, బిల్ కలెక్టర్ రోమన్ పాల్గొన్నారు.

అలాగే మాజీ వార్డు సభ్యులు గుండు లక్ష్మీనారాయణ, పెండ్యాల లక్ష్మణ్, బోళ్ల అశోక్, ఉల్లి వెంకటేశ్వర్లు, జిలకర బాబు, కొలిపాక శ్రీనివాస్, వల్లందాస్ దేవదానం, కట్కూరి జనార్దన్, ఎస్.కె. యాకుబి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కట్కూరి పద్మా జనార్దన్, నాగబెల్లి సావిత్ర, లక్ష్మీనారాయణ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కల నెరవేరుతున్నందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఉమా మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.