BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:31 pm
Posted by : K MAHESH

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:31 PM
16 వీక్షణలు

ఈ నెల 13 నుంచి 15 వరకు కరీంనగర్‌లో పోటీలు

విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయ బృందం

కురవి, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కురవి మండలం గుండ్రాతిమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు.

గుండ్రాతిమడుగు జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన బి. కావ్య, బి. మౌనిక, జి. వినయ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే. జానయ్య తెలిపారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.

విద్యార్థులు పోటీల్లో ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఎంపికపై పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో పీటీ కమల్ కిషోర్, ఉపాధ్యాయులు బద్రు, యాదగిరి, సురేష్, మహేష్, శ్రీధర్, రాంసింగ్, రమ, శోభారాణి, బాబు తదితరులు పాల్గొన్నారు.