BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 07:51 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఒకే చెట్టుకు వేలాడుతూ ఇద్దరు బాలికల మృతదేహాలు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
09 Nov, 2026 - 07:51 PM
8 వీక్షణలు

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఘటన.. మృతికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు

షాజహాన్‌పూర్, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిగోహి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హరైయా గ్రామంలో సోమవారం ఉదయం 17, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికల మృతదేహాలు ఒకే జామచెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.

గ్రామస్తులు ఉదయం పొలాల వైపు వెళ్తున్న సమయంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరిసరాలను పరిశీలించి ఆధారాలు సేకరించడంతో పాటు విచారణ ప్రారంభించాయి.

ప్రాథమిక విచారణలో మృతులిద్దరూ దగ్గరి బంధువులని, మంచి స్నేహితులని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇద్దరూ సోషల్ మీడియాలో రీల్స్ పోస్టు చేసేవారని, వారి ఇళ్ల మధ్య కూడా కొద్ది దూరమే ఉందని తెలిసింది.

పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే బాలికల మరణాలకు గల అసలు కారణం ఇంకా వెల్లడికాలేదు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణాలకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.