BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:01 pm
Posted by : SEETHA KIRAN KUMAR

48 గంటలకు మించి జైలులో ఉంటే ఉద్యోగి ఆటోమేటిక్‌గా సస్పెండ్‌: సుప్రీంకోర్టు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
09 Nov, 2026 - 08:01 PM
10 వీక్షణలు

ప్రత్యేకంగా సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయకపోయినా నిబంధనలు వర్తింపు.. బెయిల్‌ రద్దుపైనా కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ (ఎన్ టుడే న్యూస్):

ప్రభుత్వ ఉద్యోగి అరెస్టై, న్యాయస్థానం ఆదేశాల మేరకు 48 గంటలకు మించి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటే ప్రత్యేకంగా సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయకపోయినా, నిబంధనల ప్రకారం ఆయన సస్పెండ్‌ అయినట్లుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్‌కు సంబంధించిన నిబంధనలను అమలు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని ఈ వ్యవహారం ద్వారా స్పష్టమవుతోంది.

బీహార్‌లోని సమస్తిపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ అధికారిపై లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక ఉద్యోగికి రావాల్సిన రూ.36,421 జీతం ఇప్పించేందుకు సదరు అధికారి రూ.4,000 లంచం అడిగినట్లు కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఆయనను అరెస్టు చేయగా, దాదాపు 15 రోజుల పాటు జైలులో ఉన్నారు.

నిబంధనల ప్రకారం 48 గంటలకు మించి జైలులో ఉన్నందున, ఆయన అప్పటికే సస్పెండ్‌ అయినట్లుగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఈ కేసులో తొలుత కింది కోర్టు సదరు అధికారికి బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, ఆ తర్వాత పాట్నా హైకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

లంచం మొత్తం తక్కువగా ఉందన్న ఒక్క కారణంతోనే కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయడం సరైన విధానం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిందితుడికి నేర చరిత్ర ఉండటం లేదా కేసులో ఇతర తీవ్రమైన పరిస్థితులు ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అలాంటి ప్రత్యేక పరిస్థితులు లేనప్పుడు సాధారణంగా బెయిల్‌ మంజూరు చేసే అంశాన్ని పరిశీలించవచ్చని తెలిపింది.

ఈ నేపథ్యంలో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను తిరిగి కొనసాగిస్తూ, పాట్నా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

అదే సమయంలో సదరు అధికారిని సస్పెండ్‌ చేసిన తర్వాత, ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేసి తిరిగి అదే ప్రభుత్వ ఆస్పత్రిలో అదే ఉద్యోగంలో నియమించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని బీహార్‌ ప్రభుత్వం వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టై 48 గంటలకు మించి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నప్పుడు వర్తించే సస్పెన్షన్‌ నిబంధనలను సంబంధిత శాఖలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఈ తీర్పు మరోసారి గుర్తుచేసింది.